సీఎం చంద్రబాబు విజ్ఞప్తి.. ముందుకొచ్చిన ఎలక్ట్రానిక్ కంపెనీలు

News
0

 


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురవడంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడమేరు ఉధృతికి లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. పలువురి ఇళ్లల్లోని వస్తువులు నీటికి కొట్టుకుపోగా.. మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా పాడయ్యాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితుల సమస్యలను అధికారులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బాధితులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇందులో భాగంగానే ఈరోజు(మంగళవారం) ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయా కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడను వరదలు ముంచెత్తాయని.. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

వాటి రిపేర్లు చేసే అంశంపై కంపెనీల ప్రతినిధులు బాధితులకు అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వరదలతో ప్రజల ఇళ్లల్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు తడిసి పాడైపోయాయని చెప్పారు. కంపెనీలు సామాజిక బాధ్యతతో బాధితుల ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేయడానికి ముందుకు రావాలని సూచించారు. స్పేర్ పార్ట్స్ డిస్కౌంట్‌లో అందించాలని విన్నవించారు. ఎలక్ట్రానిక్ కంపెనీల సేవల బృందాలు ఒకే వేదిక మీదకు వచ్చి సర్వీస్ అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">