కోల్‌కతా, సెప్టెంబర్ 10: కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచార ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
అలాంటి వేళ మమతా బెనర్జీ ప్రభుత్వంలోని ఆరోగ్య శాఖలో చోటు చేసుకొంటున్న పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు జవహర్ సిర్కార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం, కోల్‌కతాలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ జవహర్ సిర్కార్ మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖలో తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై అవినీతి అధికారులు ప్రభావం తీవ్రంగా ఉందన్నారు.